

కడప జిల్లాVRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ సెప్టెంబర్ 24
కడప జిల్లా సిద్ధవటం మండలం ఇటీవల స్టేట్ డైరెక్టర్లుగా నియమితులైన 15 మందితో కలిపి ఆ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాగుల్ మీరా విజయవాడ తన పార్టీ ఆఫీసులో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న కార్పొరేషన్ డైరెక్టర్లలో ఒకరైన మన మాధవరం 1 నివాసి శ్రీ డాక్టర్ నాగూరు వీరభద్రుడు గారు. ఈ సందర్భంగా,కార్పొరేషన్ విధివిధానాలను, నిర్వహించవలసిన కార్యక్రమాలను, జరుగుతున్న పరిణామాలను సూచాయిగా చర్చించుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
ఈ సందర్భంగా వీరభద్రుడు వారి కార్పొరేషన్ చైర్మన్ ను శాలువాతో సత్కరించి ఫ్లవర్ బొకే మరియు స్వీట్స్ అందించి శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్పొరేషన్ ను ఒక ఉన్నత స్థానంలో నిలపాలని తద్వారా పార్టీకి, రాష్ట్ర ప్రజలకు మేలు చేకూర్చ గలగాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా తనతో పాటు డైరెక్టర్లుగా నియమితులైన మిగతా 14 మందిని పర్సనల్గా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird