Vrm media ఎల్లందు ప్రతినిధి
ఎల్లందు సింగరేణి GM ఆఫీస్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించబడ్డాయి. సింగరేణి సిబ్బంది, మహిళా ఉద్యోగులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని పూలతో బతుకమ్మలను అలంకరించారు. సంప్రదాయ వేషధారణలో పాల్గొన్న మహిళలు పాటలు పాడుతూ, చిందులేసి వేడుకలను మరింత అందంగా తీర్చిదిద్దారు.
అధికారులు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సాంప్రదాయాలకు ప్రతీక అని, ఉద్యోగులందరూ కలిసిమెలిసి జరుపుకోవడం ఆనందకరమని తెలిపారు. పూల వనమాలలతో అలరించిన బతుకమ్మ చుట్టూ అందరూ ఆడిపాడి సంతోషాన్ని పంచుకున్నారు.



VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird