Home వార్తలుఖమ్మం ది.25.09.2025పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం …

ది.25.09.2025పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం …

by VRM Media
0 comments

Vrm media ఖమ్మం ప్రతినిధి

పోలీస్ కుటుంబాలకు ఉచిత ENT వైద్య పరిక్షలు :పోలీస్ కమిషనర్

ప్రవీణ్ ENT హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెవి, ముక్కు, గొంతు పరిక్షల ఉచిత వైద్య శిబిరాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రారంభించారు. పోలీస్ కమిషనర్ సూచనల మేరకు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గురువారం వంద మంది పోలీస్ కుటుంబ సభ్యులు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ … పోలీస్ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా పోలీస్ సిబ్బందికి కోసం ENT వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

నిత్యం విధి నిర్వహణలో వుండే పోలీస్ సిబ్బందికి తమ చెవి, ముక్కు, గొంతు వంటి చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా
వైద్య నిపుణుల సలహా, సూచనలతో ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవార్చుకోవాలని అన్నారు. సమస్యలతో బాధపడుతున్న వారు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ సిబ్బందికి సూచించారు.

కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా & అర్డర్ ప్రసాద్ రావు,అడిషనల్ డీసీపీ అడ్మిన్ రామానుజం, ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, విజయబాబు,ఏఆర్ ఏసీపీ నర్సయ్య, సుశీల్ సింగ్, ఇన్స్పెక్టర్ మోహన్ బాబు, ఆర్ఐలు కామరాజు, శ్రీశైలం, సాంబశివరావు, నాగుల్ మీరా, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు. పి ఆర్ వో

2,840 Views

You may also like

Leave a Comment