Home ఆంధ్రప్రదేశ్ సభ్యత్వం ఉన్న కార్యకర్తల కుటుంబాలకు అండగా టీడీపీ ఇన్సూరెన్స్ సహాయం కొరకు ఫైల్ అందజేత

సభ్యత్వం ఉన్న కార్యకర్తల కుటుంబాలకు అండగా టీడీపీ ఇన్సూరెన్స్ సహాయం కొరకు ఫైల్ అందజేత

by VRM Media
0 comments

విజయవాడVRM న్యూస్ రిపోర్టర్ సెప్టెంబర్ 26

విజయవాడ టీడీపీ సెంట్రల్ కార్యాలయంలో సిద్దవటం మండలం టీడీపీ కార్యకర్త ప్రదీప్ కుమార్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సందర్భంలో, ఆయనకు పార్టీ సభ్యత్వం ఉన్నందున కుటుంబానికి టీడీపీ తరపున ఇన్సూరెన్స్ సాయం అందేలా ఫైల్ అందజేసిన టీడీపీ నాయకులు.
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ , రాజంపేట ఇంచార్జి జగన్ మోహన్ రాజు ప్రత్యేక ధన్యవాదములు తెలిపిన పార్లిమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి మరియు బీసీ సెల్ నాయకులు రాజశేఖర్ యాదవ్
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి, బీసీ సెల్ నాయకులు రాజశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నాగముని రెడ్డి మాట్లాడుతూ టీడీపీ పార్టీ సభ్యత్వం కలిగిన ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ సదుపాయం లభించేలా ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని అమలు చేస్తుండటం విశేషం. ఇలాంటి అండదండలు కార్యకర్త కుటుంబాలకు భరోసా కలిగించడమే కాక, పార్టీపై విశ్వాసాన్ని మరింత బలపరుస్తున్నాయి.
ప్రతి కార్యకర్తను కుటుంబ సభ్యులుగా భావించి, వారు ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితుల్లో సహాయం అందించడంలో టీడీపీ ప్రత్యేకతను మరోసారి నిరూపించింది.

2,828 Views

You may also like

Leave a Comment