

వచ్చేనెల 12న టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్, ఖమ్మం పట్టణంలో జరగబోయే లాఫ్టర్ యోగ జాతీయ సదస్సుకు ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీ అనుదీప్ దురిశెట్టి గారిని ఆహ్వానించినట్టు లాఫ్టర్ యోగ జాతీయ చైర్మన్ ,తెలంగాణ యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షు సేవక్ ,యోగవిద్యను కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశంగా చేర్చాలని హైకోర్టులో పిల్ దాఖలు చేసిన అడ్వకేట్ మరికంటి వెంకట్ తెలియజేశారు, ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ట్రైనర్స్ సంస్థలు ప్రపంచ నవ్వు యోగా గురువు శ్రీ మదన్ కటార్య తెలంగాణ మంత్రులు మరియు అధికారులు వివిధ సంస్థల వారు పాల్గొంటారని ఈ కార్యక్రమంలో 2026 యోగ క్యాలెండర్ డైరీ లాఫ్టర్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ పుస్తకావిష్కరణతో పాటుగా జాతీయ ఉచిత లాఫ్టర్ యోగ సాధన శిక్షణ కేంద్రం అర్బన్ వెలుగుమట్ల ఫారెస్ట్ ఖమ్మం కేంద్రం లోగో ఆవిష్కరణ ఉంటుందని ఈ సదస్సుకు వేలాదిగా హాజరై జయప్రదం చేయవలసినదిగా కోరుతూ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు లాఫ్టర్ మెడిటేషన్ మధ్యాహ్నం భోజనం తర్వాత రెండు గంటల నుంచి లాఫింగ్ యోగ పీస్టు వివిధ రకాల లాఫ్టర్ యోగ టెక్నిక్స్ నేర్పుతారని సౌత్ ఇండియా నుంచి డాక్టర్స్ కూడా వస్తున్నారని తెలియజేశారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird