Home ఆంధ్రప్రదేశ్ గతాన్ని మర్చిపోవడం సరికాదు హిందూపురం ఎమ్మెల్యే పై ధ్వజమెత్తిన ముదునూరి

గతాన్ని మర్చిపోవడం సరికాదు హిందూపురం ఎమ్మెల్యే పై ధ్వజమెత్తిన ముదునూరి

by VRM Media
0 comments

మతిస్థిమితం లేని వాళ్ళని సైకోలు అంటారు
అటువంటి సర్టిఫికెట్లు ఉండడంవల్ల ఈరోజున మీరు బయట తిరుగుతున్నారు. ముదునూరి

ప్రత్తిపాడు,వి.ర్.ఎం.న్యూస్24:-ప్రతినిధి, ప్రిన్స్, సెప్టెంబర్, 26:-

ప్రత్తిపాడు నియోజకవర్గం ధర్మవరం గ్రామంలో వైఎస్ఆర్సిపి నాయకులు మరియు నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు, ఎం ఎం ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ముదునూరి మురళి కృష్ణంరాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు సిగ్గుగా ఉన్నాయని అటువంటి ధ్రువీకరణ పత్రంతో ఎవరు బయట తిరుగుతున్నారో తెలుసుకోవాలని తీవ్రంగా ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆనాడు సినీ ప్రముఖులచే ఏ విధంగా గౌరవప్రదంగా నడుచుకున్న విధానాన్ని సినీ ప్రముఖులు చిరంజీవి లేఖ ద్వారా తెలియజేసిన విధానాన్ని గుర్తు చేసుకోవాలని. మీరు హిందూపురం లో ఎమ్మెల్యేగా ఉండి అక్కడ సమస్యలపై పోరాడడం చేత కాదు. మీ నాయకుడు ఇచ్చిన హామీలను అమలు చేయమని అడగడం చేతకాదు. సమయం ఇచ్చారు కదా అని మా నాయకుడి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని. వైయస్సార్ కుటుంబం మీకు చేసిన మంచిని మర్చిపోతే కృతజ్ఞతలు లేని వ్యక్తులుగా మిగిలిపోతారని మండిపడ్డారు. End 👆

2,819 Views

You may also like

Leave a Comment