
ప్రత్తిపాడు,వి.ర్.ఎం.న్యూస్ 24,ప్రతినిధి,ప్రిన్స్,సెప్టెంబర్, 26:-
రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం కూటమి ప్రభుత్వం లక్ష్యమని కూటమి శ్రేణులు అన్నారు.ఈసందర్భంగా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి సూచనలతో స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభయాన్, కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో గ్రామ ప్రజలకు పలు రకాల ఉచిత వైద్య పరీక్షలు అందించారు.ఆరోగ్యకరమైన మహిళలు బలమైన కుటుంబాల కోసం కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమము ఏర్పాటు చేశారని తెలిపారు. మహిళలలుకు స్క్రీనింగ్, రక్తపోటు, మధుమ్యాహం,నోటి క్యాన్సర్,రొమ్ము క్యాన్సర్,గర్భాశయ క్యాన్సర్, మొదలగు వ్యాధులకు
డాక్టర్ బి రాంబాబు నాయక్, కె స్స్నేహాల్ నిర్ధారణ పరీక్షలు చేపట్టారు.అవసరమగు మందులను రోగులకు అందించారు.ఈ కార్యక్రమంలోపంచాయతీ కార్యదర్శి, నాయకులు సుంకర సత్యనారాయణ,వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ శెట్టి చిన్న, బుద్ధ ఈశ్వరరావు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు.వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, హెల్త్ సూపర్వైజర్ కే దైవ కృప, హెల్త్ అసిస్టెంట్లు, ఎం ఎల్ హెచ్ పి లు, ఏఎన్ఎంలు,ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తలు కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.