
ప్రత్తిపాడు,వి.ర్.ఎం.న్యూస్ 24,ప్రతినిధి,ప్రిన్స్, సెప్టెంబర్, 26:-
దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం జగన్మాత ధనలక్ష్మీ అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చింది.ప్రత్తిపాడు మండలం రౌతుపాలెం గ్రామంలో ఆలయ ధర్మకర్త జానకి శివబాబు ఆధ్వర్యంలో పెద్దాపురం మండలం ఉలిమేశ్వరం వాస్తవ్యులు గల్లా వీర వెంకటరావు,వారి సతీమణి పుష్ప, కుమారుడు యశ్వంత్ వీర దుర్గ సహకారంతో నగదు నోట్లతో ధగ ధగ మెరిసేలా అలంకరించారు.ఈ సందర్బంగా మహిళలు ప్రత్యేక పూజలు,కుంకుమ పూజలు చేశారు.ఆగమ సంప్రదాయానికి అనుగుణంగా అమ్మవారు అలంకృతురాలై భక్తుల పూజలు అందుకుంది.ధనలక్ష్మీ అలంకరణలతో శోభిల్లిన అమ్మవారిని భక్తజనం దర్శించుకుని దేవీ అనుగ్రహం పొందారు.అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించిన గల్లా వీర వెంకటరావు కుటుంబ సభ్యులను ఆలయ ధర్మకర్త జానకి శివ బాబు అభినందించారు.