

కడప VRM న్యూస్ స్టాప్ రిపోర్టర్ పి ఈశ్వర్ సెప్టెంబర్ 28 :
కడప జిల్లా భారత దేశ స్వాతం త్య్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప భారతీయ విప్లవ కారుడు భగత్ సింగ్ అని జన సేనపార్టీ పులివెందుల నియోజక వర్గ సీనియర్ నేత, ఛలో పీఠాపురం సమన్వయ కర్త డా దాసరి రవిశంక ర్ అన్నారు ఆదివారం స్థానిక వేంప ల్లి పట్టణంలోని ఆ పార్టీ కార్యాల యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిం చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ లో జన్మించారని చెప్పారు యువతలో చైతన్యం నింపి జాతీయోద్యమానికి ఉత్తేజితులను చేసిన దేశ భక్తుడని కొనియా డారు.లాహోర్ కుట్ర కేసులో ఒక బ్రిటిష్ అధికారిని హత్య చేశాడన్న ఆరోపణపై 1931 మార్చి 23 న ఉరి తీయబడ్డారని చెప్పారు . దేశం కోసం ప్రాణాలర్పించిన గొప్ప మహనీయుడు ,అమరుడని చెప్పారు.నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ యువ నాయకుడు నాగ మల్లి కార్జున, రామయ్య, నారాయణ, మహబూబ్ బాషా , ఉదయ్, కిరణ్, వేణు గోపాల్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు