

తహసీల్దార్ కి వినతిపత్రం అందించిన నాయకులు
ప్రత్తిపాడు,వి.ఆర్.ఎం.న్యూస్ 24:-ప్రతినిధి, ప్రిన్స్, సెప్టెంబర్, 29:-
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం చింతలూరు గ్రామంలో గిరిజనులు,ఆదివాసీల సాగులో ఉన్న ఈనాం భూముల్లో సాగు దారులకు హక్కు కల్పించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.ప్రత్తిపాడులో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసనకారులు ర్యాలీ చేపట్టారు.తమ సమస్యను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు,రాష్ట్ర నాయకులు మానుకొండ లచ్చబాబు,మండల కార్యదర్శి తాడి నాగేశ్వరరావులు మాట్లాడుతూ చింతలూరు గ్రామంలో సుమారు 1450 ఎకరాల ఈనాం భూమిని ఇప్పటికే రెవెన్యూ డివిజనల్ అధికారి డిక్లేర్ చేశారని,ఈనాం అధికారి తహసీల్దార్ విచారణ జరిపి పేదల సాగులో ఉన్న భూమిని రెవెన్యూ రికార్డులో నమోదు చేయించాలని కానీ వలసదారులు,భూభకాసురులు ఈ ప్రాంతంలో కొంతమంది అధికారులను మభ్యపెట్టి సుమారు 6 ఎకరాల 76 సెంట్లు భూమిని రెవెన్యూ రికార్డుల మార్పు జరిపించినట్లు తెలుస్తోందని అన్నారు.సంబంధిత అధికారులు సమస్య పరిష్కరించి పేదలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘ నాయకులు రేచుకట్ల సింహాచలం,తాడి లక్ష్మణ్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird