ది.29.09.2025
పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం ..
Vrm Media ఖమ్మం ప్రతినిధి


పోలీస్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో సోమవారం పోలీస్ పరేడ్ మైదానంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వేడుకల సందర్భంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆయన సతీమణి నిష్టాశర్మ గౌరమ్మకు పూజ చేసి ప్రారంభించారు. పోలీస్ కుటుంబాలు బతుకమ్మలను వివిధ రకాల పూలతో పేర్చి రంగు రంగుల బతుకమ్మలుగా సుందరంగా పేర్చారు. పెద్ద ఎత్తున బతుకమ్మలను మహిళలు తీసుకొచ్చి ఒకే చోట ఉంచి పాటలు పాడుతూ చప్పట్లను వేస్తూ, కోలాటాలు ఆడి ఆహ్లాదకర వాతావరణంలో ఆనందంగా జరుపుకున్నారు. మహిళలు అధిక సంఖ్యలో రావడంతో పరేడ్ గ్రౌండ్స్ కోలాహలంగా మారింది.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా &అర్డర్ ప్రసాద్ రావు, అడిషనల్ డీసీపీ అడ్మిన్ రామానుజం,ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఏసీపీలు సుశీల్ సింగ్, RI లు కామరాజు, శ్రీశైలం, సురేష్, సిఐలు కరుణాకర్, చిట్టిబాబు, పాల్గొన్నారు. పి ఆర్ వో