Home వార్తలుఖమ్మం తండ్రి ఆటోవాలా….. కొడుకు ఎంపీడీవో….

తండ్రి ఆటోవాలా….. కొడుకు ఎంపీడీవో….

by VRM Media
0 comments

సివిల్స్ సాధించడమే నా లక్ష్యం కంచెపోగు వంశీ కృష్ణ

VRM మీడియా ప్రతినిధి శ్రీనివాస రాథోడ్

కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించాడు. విద్యకు పేదరికం అడ్డు కాదని కష్టపడి చదివితే ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవచ్చని నిరూపించి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ప్రకటించిన గ్రూప్ వన్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఎంపీడీవో పోస్ట్ సాధించారు. మండల పరిధి చెన్నూరు గ్రామానికి చెందిన కంచిపోగు వంశీ కృష్ణ . తండ్రి రాములు ఆటో డ్రైవర్ గా, తల్లి సుశీల వ్యవసాయ కూలిగా పనిచేస్తూ తమ కొడుకుని ఉన్నత స్థానంలో చూడాలని లక్ష్యంతో కష్టాలను లెక్కచేయకుండా ఉన్నత చదువులు చదివించారు. తన తండ్రి ఆశను నిజం చేస్తూ గ్రూప్ వన్ ఫలితాల్లో ఎంపీడీవో పోస్ట్ సాధించి తన తండ్రికి కానుక ఇచ్చాడు .బాల్యం నుండి చదువు మొత్తం ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ నలుగురికి ఆదర్శంగా నిలిచారు .
విద్యాభ్యాసం

విద్య ఒకటి నుండి ఐదు వరకు ఎంపీపీ చెన్నూరు లో 5వ.తరగతి వరకు,6నుండి10వరకు ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాల్వంచ, ఇంటర్మీడియట్ కృష్ణవేణి కాలేజ్, జి బి ఐ ఈ టి (మొయినాబాద్) కాలేజీలో బిటెక్ ,ఇగ్నూ(ఐ జి ఎన్ ఓ యూ)లో రాజకీయ శాస్త్రం లో ఎంఏ, ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్ డి కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్ సి స్టడీ సర్కిల్లో సివిల్ సర్వీస్కు కోచింగ్ తీసుకున్నారు. 2024 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 4 ,గ్రూప్ 3 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఇటీవల ప్రకటించిన గ్రూప్ వన్ సర్వీసులో 930 ర్యాంకు సాధించి ఎంపీడీవో గా సెలెక్ట్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ నా చదువుకు, పోటీ పరీక్షల్లో నా తల్లిదండ్రులతో పాటు నా బ్రదర్ నాగరాజు ప్రోత్సాహం సహాయం దోహద పడిందని అన్నారు.

2,827 Views

You may also like

Leave a Comment