

స్వస్థనారి స్వశక్త పరివార్ పౌష్టికాహార మాసోత్సవాలలో పాల్గొన కూటమి శ్రేణులు
ప్రత్తిపాడు,వి.ఆర్.ఎం.న్యూస్24,ప్రతినిధి, ప్రిన్స్, సెప్టెంబర్, 30:-
రాష్ట్రంలో ప్రత్యేక కుటుంబం ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవించే లా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కూటమి పార్టీ శ్రేణులు అన్నారు ఈ సందర్భంగా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో మండల పరిషత్ అధ్యక్షులు సూచనలతో స్వస్తనారీ శ్వసక్త్ పరివార్ అభయాన్ మరియు ఎన్ డి ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరంలో గ్రామ ప్రజలకు పలు రకాల ఉచిత వైద్య పరీక్షలు అందించారు. మహిళలు ఆరోగ్యకరంగా ఉండడంతోనే కుటుంబం బలపడుతుందని కూటమి ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిందని తెలిపారు. మహిళలకు స్కానింగ్ రక్తపోటు మధుమేహం నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ మొదలగు వ్యాధులకు డాక్టర్స్ రాంబాబు కృష్ణ ప్రసాద్ నిర్ధారణ పరీక్షలు చేపట్టారు అవసరమైన మందులను రోగులకు అందించారు. పౌష్టికాహార మషోత్సవాలలో ప్రీ స్కూల్ విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. చిన్నారులు తల్లిదండ్రులకు పోటీలు నిర్వహించి విజేత అయిన వారికి స్థానిక నేతల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సూర్యప్రకాష్ ఈశ్వరరావు ఎంపీటీసీ పంచాయతీ కార్యదర్శులు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది హెల్త్ సూపర్వైజర్ దైవ కృప ఏఎన్ఎంలు ఆయాలు తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు