Home ఆంధ్రప్రదేశ్ ‘లోకనాథుడు’ శివుని కీర్తించిన లోకనాథం’ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి

‘లోకనాథుడు’ శివుని కీర్తించిన లోకనాథం’ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి

by VRM Media
0 comments

కడప కల్చరల్ VRM న్యూస్ స్టాప్ రిపోర్టర్ పి ఈశ్వర్ సెప్టెంబర్ 01:

ఆర్త జనవత్సలుడైన మహా శివుని సాంబయా, నీలకం ధరా అంటూ వివిధ నామాలతో స్తుతిస్తూ లోకనాథం తనకు శివుని పై ఉన్న అపార భక్తిని చాటుకు న్నారని ఆచార్య మూల మల్లికా ర్జున రెడ్డి అన్నారు. వైయస్సార్ కడప జిల్లా రచయితల సంఘం వారి ఆధ్వర్యంలో ‘విద్యా తపస్వి’ చిత్ర,బంధ, గర్భ కవితా నిపుణులు మామిళ్ళ వెంకటరంగయ్య లోకనా థం రచించిన ‘శ్రీ శివ శతకధ్వ యం’ (సాంబయా శతకం, నీలకం ధరా శతకం) ఆవిష్కరణ కార్యక్ర మం సోమవారం పాత కడప సనాతన ధర్మ సామూహిక ప్రార్ధన దేవాలయాల సంస్థ ప్రాంగణంలో జరిగింది. సభాధ్యక్షులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి మాట్లా డుతూ శివ భక్తి యందు అనుర క్తుడైన లోకనాథం శివునికి పద్యా లనే పుష్పాలతో పూజ చేసి, కవితా హారతిని సమర్పించారని,ఆయన పద్యాన్ని అనర్గళంగా నడిపించగల దిట్టని, లయబద్ధంగా రాగాలాపన చేయగల సమర్థుడని, రెండు శతకాల్లో పద్యాలను మనోజ్ఞంగా మృదు మధుర శబ్దాలతో రాశా రన్నారు. ముఖ్యఅతిథి కాల్వ సోమ కళానాథరెడ్డి ప్రసంగిస్తూ లోకనాథం శివుని కీర్తిస్తూ గుణ, రూప వర్ణనలతో పాటు వైరాగ్య భావాన్ని, ఆర్తిని, పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచారని, ఆయన పద్యాన్ని భక్తి భావం తో వశపరచుకున్న కార్యశీలుడని, ఆర్థిని రంగరిం చి,భక్తిని జోడించి శివునికి నివే దించుకున్న భక్తాగ్రేస రుడ న్నారు. విశిష్ట అతిథి డాక్టర్ వెల్లాల వెంక టేశ్వరాచారి మాట్లాడుతూ లోకనా థం పద్య శైలి సరళమని, ఇందలి పదాలు ఢమరుక విన్యాసాలతో గంగా ప్రవాహం వలె పరవళ్ళు తొక్కాయని,కవికున్న శివ భక్తి కట్టలు తెంచుకొని ప్రవహించిం దన్నారు. ఆత్మీయ అతిథి కాల్వ అర్జున్ రెడ్డి ప్రసంగిస్తూ 65 సంవ త్సరాల వయసులో పద్య విద్యను అభ్యసించించి రెండు సంవ త్సరాల్లోనే లోకనాథం చిత్ర,గర్భ, బంధ కవిత్వాలను రాయడం ఆయన భక్తి తత్పరతకు, మేధా శక్తికి నిదర్శనమన్నారు. అనంతరం కవిని ఘనంగా సత్కరించారు. లోకనాథం స్పందిస్తూ కేవలం నేను నిమిత్తమాత్రునేనని, ఈశ్వ రాను గ్రహం వల్లే ఈ శతకాలు రాశానని, నా సంకల్పం ఫలించిందని, సంకల్ప ప్రధాత ఈశ్వరుడే అన్నారు. కార్య క్రమంలో వెన్నపూస ముని రెడ్డి, దిలీప్ జైన్, అవ్వారు సత్యనారా యణ,సాగర్ స్వామి, సుధాకర్, ఆధ్యాత్మిక చింతనాపరులు,భక్తులు పాల్గొన్నారు.

2,829 Views

You may also like

Leave a Comment