Home ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు ఇచ్చిన హామీని నెరవేర్చిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి.

ముఖ్యమంత్రివర్యులు ఇచ్చిన హామీని నెరవేర్చిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి.

by VRM Media
0 comments

ముఖ్యమంత్రివర్యులు చేతులమీదుగా వికలాంగ పింఛన్ అందుకున్న సుమిత్రమ్మ భర్తకు ఈ-ఆటో ను అందజేసిన జిల్లా కలెక్టర్.

కడప జిల్లాVRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ , సెప్టెంబర్ 2:

ఈనెల 1న రాజంపేట మండలం బోయినపల్లి లో జరిగిన ముఖ్యమంత్రివర్యులు పర్యటనలో భాగంగా వికలాంగ పింఛన్ అందుకున్న సుమిత్రమ్మ భర్తకు ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఇచ్చిన హామీని మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి నెరవేర్చారు.
సోమవారం ముఖ్యమంత్రివర్యులు జిల్లా పర్యటనలో భాగంగా రాజంపేట మండలం పెద్దకారంపల్లి గ్రామ పంచాయితీ ములక్కాయ పల్లి లో నివాసముంటున్న సుమిత్రమ్మ ముఖ్యమంత్రివర్యుల చేతులమీదుగా వికలాంగ పింఛన్ 15000 రూపాయలను అందుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు…. సుమిత్రమ్మ భర్త వెంకటేశ్వర రాజు తో మాట్లాడినప్పుడు తాను పాత ఆటోను నడుపుకుంటున్నానని తెలుపగా నూతన ఆటోను ఆయనకు అందజేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరిని ఆదేశించారు.
ముఖ్యమంత్రివర్యుల ఆదేశాల మేరకు మంగళవారం నాడు జిల్లా కలెక్టర్ 3.45 లక్షలతో కొత్త ఈ-ఆటోను కొనుగోలు చేసి సుమిత్రమ్మ భర్త వెంకటేశ్వర రాజుకు అందజేశారు.
ఈ సందర్భంగా ఈ-ఆటోను జిల్లా కలెక్టర్ ద్వారా అందుకున్న సుమిత్రమ్మ భర్త వెంకటేశ్వర రాజు…. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి కృతజ్ఞతలు తెలిపారు.

2,829 Views

You may also like

Leave a Comment