Home వార్తలుఖమ్మం బిఆర్ఎస్ పార్టీ క్రమ శిక్షణ ఉల్లంఘించిన వారిపై చర్యలు సబబే

బిఆర్ఎస్ పార్టీ క్రమ శిక్షణ ఉల్లంఘించిన వారిపై చర్యలు సబబే

by VRM Media
0 comments

బిఆర్ఎస్ పార్టీ యువజన తెలంగాణ రాష్ట్ర యువ నాయకులు దేవరపల్లి పట్టాభిరామ్

VRM న్యూస్ ప్రతినిధి శ్రీనివాస రాథోడ్

బిఆర్ఎస్ పార్టీ క్రమ శిక్షణ కలిగిన పార్టీని దీనిని అతిక్రమించిన ఎవరి పైన చర్యలు తప్పవని మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కే చంద్రశేఖర రావు రుజువు చేశారని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన యువ నాయకులు దేవరపల్లి పట్టాభి పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీ లైను దాటి మాట్లాడిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై పార్టీ అధ్యక్షులు సస్పెండ్ చేయటం బాధాకరమే అయినప్పటికీ
పార్టీ క్రమ శిక్షణ దృష్ట్యా అందరూ సమానమేనని స్పష్టమైనదని పట్టాభి తెలిపారు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నిర్ణయం తమకు శిరోధారమని ఆయన అన్నారు. సామాన్య కార్యకర్త అయిన, కుటుంబ సభ్యులైన
పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరు సమానమేనని తమ నాయకులు ఈ చర్య ద్వారా తెలిపారని దేవరపల్లి పేర్కొన్నారు. రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం
రానున్నదని కార్యకర్తలు,
నాయకులు, సంయమనం పాటించి ప్రతీ ఒక్కరూ పార్టీ అభివృద్ధికి కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు .

2,831 Views

You may also like

Leave a Comment