Home వార్తలుఖమ్మం జర్నలిస్టుల సంక్షేమం “మన ప్రెస్ క్లబ్” తోనే సాధ్యం – గద్దల సుబ్బారావు.

జర్నలిస్టుల సంక్షేమం “మన ప్రెస్ క్లబ్” తోనే సాధ్యం – గద్దల సుబ్బారావు.

by VRM Media
0 comments

VRM మీడియా రిపోర్టర్ లక్ష్మయ్య
సత్తుపల్లి
ఖమ్మం జిల్లా
జర్నలిస్టుల సంక్షేమం “మన ప్రెస్ క్లబ్” తోనే సాధ్యం – గద్దల సుబ్బారావు.

జర్నలిస్టుల సంక్షేమం మన ప్రెస్ క్లబ్ అఫ్ సత్తుపల్లి తోనే సాధ్యమని అందుకు అందరు సంఘంతో కలిసి రావాలని, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గద్దల సుబ్బారావు అన్నారు.
సత్తుపల్లి పట్టణం లోని నైంటీ నైన్ టీవీ స్టూడియో నందు ఘనంగా జరిగిన “మన ప్రెస్ క్లబ్ అఫ్ సత్తుపల్లి” తృతీయ సమావేశానికి హాజరైన జర్నలిస్టులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ…
మన ప్రెస్ క్లబ్ తృతీయ సమావేశం ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని అదేవిధంగా మన ప్రెస్ క్లబ్ లోని ప్రతి జర్నలిస్టు సంక్షేమము మనమందరము పనిచేద్దామని అలాగే ప్రజా సమస్యలపై నిరంతరం వార్తలను రాసి వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఇడుపులపాటి నరేష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ప్రెస్ క్లబ్ లో ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్టు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళే విధంగా మీ అందరి సహకారంతో పోరాడతామన్నారు. ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో కోశాధికారి నక్కా లక్ష్మయ్య, జర్నలిస్టులు యాధాల శ్రీనివాస్,తడికమల్ల అర్జునరావు, అజ్మీరా సునీత, కంటే శేఖర్ అయినంపూడి సంతోష్, కళ్ళకో పూర్ణచారి,ఆంబోజు పెద్ద నరసింహారావు, జిల్లేపల్లి విష్ణు మూర్తి, ఆంబోజు చిన్న నర్సింహారావు, ఎండి అఫ్జల్, గోళ్ళమూడి కృష్ణ,కొప్పుల రవీంద్ర , ఖైరంబీ, రిజ్వానా తదితరులు పాల్గొన్నారు…

2,845 Views

You may also like

Leave a Comment