VRM MEDIA ప్రతినిధి రవి కుమార్ ఖమ్మం



ఈరోజు అనగా 8.9.2025 మధ్యాహ్నం సుమారు ఒంటిగంట సమయంలో ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తన సిబ్బందితో కొత్త బస్టాండ్ వెనుక వైపుగల ఎన్ ఎస్ ఎస్టి రోడ్డు నందు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఒక బైక్ పై ఇండస్ట్రియల్ రోడ్డు వైపు నుండి కొత్త బస్టాండ్ వైపు వెళ్తూ పోలీస్ వారిని చూసి తప్పించుకుని వెళ్లే ప్రయత్నం చేయగా అనుమానంతో వారిని పట్టుకుని వారి వద్దనున్న బ్యాగ్ ని చెక్ చేయగా దొంగలించిన బంగారం మరియు వెండి వస్తువులనతో పట్టుబడినారు వారి పేర్లు చల్లా వెంకటేశ్వర్లు కార్ డ్రైవర్ రెసిడెంట్ ఖమ్మం నెటివ్ ప్లేస్ అన్నపురెడ్డిపల్లి గ్రామం. దేవన బోయిన మహేష్ అలియాస్ బాతు బట్టల షాపులో సేల్స్ మెన్ గా పనిచేస్తుంటారు రెసిడెన్స్ ఆఫ్ శ్రీరామ్ నగర్ కాలనీ భద్రాచలం.
దొంగతనాలకు పాల్పడిన ముఖ్యమైన కేసుల వివరాలు 14.5. 2024 సాయంత్రం 7:00 సమయంలో ఖమ్మం బైపాస్ రోడ్డు కొత్త బస్టాండ్ వద్ద నుండి ఒక మహిళా ఆర్ఆర్ స్కూల్ వైపు నడుస్తూ వెళ్తుండగా బైక్ పైన వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు చైన్లు లాక్కొని పారిపోవడం జరిగింది 12.3.2025న రాత్రి సమయంలో తిరుగుతూ ఒక తాళం వేసిన ఇంటి డోర్ పగలగొట్టి లోనికి ప్రవేశించి బంగారు వస్తువులన దొంగిలించి పారిపోయారు. 8.4. 2025 సాయంత్రం నడుచుకుంటూ వెళుతుండగా ఆమె మెడలో గొలుసు లాక్కొని పారిపోయారు. అదేవిధంగా 4. 7. 2025న పగలు బైక్ పై ఖమ్మం బైపాస్ రోడ్ లోని బ్యాంక్ కాలనీలో ఒక ఇంటి తాళం పగలగొట్టి బంగారు వస్తువులను దొంగలించారు.