
కడప ఎడ్యుకేషన్ VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ సెప్టెంబర్ 08:
కడప జిల్లాయోగి వేమన విశ్వవిద్యాలయం లలితకళా విభాగం రీసెర్చ్ స్కాలర్ ఈ. సుజాత కు 2026 మే మాసంలో స్పెయిన్ లో జరుగనున్న అంతర్జా తీయ సెమినార్ కు ఆహ్వానం అందింది. సదస్సు నిర్వాహకులు ఫెర్నాండెజ్ ఈ మెయిల్ ద్వారా ఆమెను ఆహ్వానించారు. ఈ పర్యటనకు అయ్యే ప్రయాణ , వసతి, వీసా ఖర్చులు నిర్వాహ కులు భరిస్తారని తెలిపారు. ప్రస్తుతం సుజాత , లలిత కళా శాఖ విభాగాధిపతి డాక్టర్ కోట మృత్యుంజయ రావు మార్గదర్శ కత్వంలో “ విజయనగర పెయింటింగ్స్ “ మీద పరిశోధన చేస్తున్నారు. పరిశోధనలో భాగం గా “ తిరుపరట్టికుండ్రం ఆలయం లోని ఉన్న జైన్ కుడ్యచిత్రాల పై రీసెర్చ్ గైడ్ తో సంయుక్తం గా ప్రచురించిన పేపర్ ఆధారం గా నిర్వాహకులు సుజాత ని ఆ సదస్సు లో ప్రారంభ సమావేశం లో ప్రసంగించవలసింది గా ఆహ్వానించారని డాక్టర్ కోట మృత్యునజయ రావు తెలిపారు. సుజాత ఎంపిక పట్ల యూనివ ర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాస రావు, ప్రిన్సిపాల్ ఆచార్య టీ. శ్రీనివాస్ , రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ. అధ్యాపకులు సి.హెచ్. వెంకటేష్ ,బి.చినరాయుడు, బి. ఈరప్ప , చంటి సూరి , ఎం. వాసవి హర్షం వ్యక్తం చేశారు.