*నూతనంగా నిర్మించిన ప్రభుత్వ హాస్పిటల్ ను వెంటనే ప్రారంభించి పూర్తి స్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి *సీపీయమ్ పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు తన్నీరు క్రిష్ణార్జునరావు*
సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ వినతి పత్రం ఇచ్చిన అనంతరం తన్నీరు క్రిష్ణార్జునరావుమాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో గ్రామాల్లో మరియు మండల కేంద్రంలో విషజ్వరాలు విపరీతంగా పెరుగుతున్నాయి.దానికి అనుగుణంగా ఇప్పుడు వున్న పాత హాస్పిటల్ లో సరైన వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మరియు రోగులు కూడా ఇబ్బందులు పడుతున్నారు ఒక్కోమంచంమీద ఇద్దరు రోగులు ఉన్నారు,సరైన వైద్య సదుపాయాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు మరియు పూర్తి స్థాయిలో వైద్యులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.అలాగే ఆసుపత్రి భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.కావున నూతన ఆసుపత్రి భవనం లోకి వెంటనే ప్రారంభించి పూర్తి స్థాయిలో రోగులకు వైద్య సేవలు అందించాలని,అన్నిరకాల వైద్య సిబ్బందిని నియమించాలని కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ కి వినతి పత్రం ఇవ్వటం జరిగింది.ఈకార్య క్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యుడు బట్టు నరసింహారావు, నాయకులు నాయుడు రవికొండలరావు తదితరులు పాల్గొన్నారు.

2,833 Views

You may also like

Leave a Comment