
రాయచోటిVRM న్యూస్ రిపోర్టర్ సెప్టెంబర్ 9
రాయచోట్లోని సాయి సుధా కళ్యాణ మండపం నందు బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ అధ్యక్షతన సేవా పక్షోత్సవాల జిల్లా కార్యాలయాలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బిజెపి సేవా పక్షోత్సవాల రాష్ట్ర కన్వీనర్ కాపు రామచంద్రారెడ్డి మరియు నంద్యాల జిల్లా ఇన్చార్జి పోతు గుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ రెండో తేదీ వరకు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని వివిధ రకాల సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించాలని లో భాగంగా మన జిల్లాలో కూడా రక్తదాన శిబిరాలు చెట్లు నాటడం వికలాంగులకు పరికరాలు పంచడము స్వచ్ఛభారత్ నిర్వహించడం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని దానికి మండల స్థాయిలో పోలింగ్ బూత్ స్థాయిలో ఎలా చేయాలి అనే దాని పైన కారిశాల నిర్వహించడం జరిగింది నరేంద్ర మోడీ గారు 2047 నిక్షిత్ భారతి లక్ష్యంగా పనిచేస్తున్నారు దానికి మనందరి తోడ్పాటు ఎంతో అవసరమని ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా దేశం కోసం దేశ అభివృద్ధి కలిగించే విధంగా స్థానిక వస్తువులు వినియోగిస్తూ ఆర్థిక ప్రగతిలో ముందుండాలని వారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శిలు ఎల్లంపల్లి ప్రశాంత్ ఆనంద్ గజపతిరాజు గోపాల్ రెడ్డి రంగారెడ్డి డాక్టర్ బాలగిరి శ్రీనివాసరాజు నిర్మల్ కుమార్ కొత్తూరు శ్రీకాంత్ అన్ని మండలాల అధ్యక్షులు కార్యక్రమము కన్వీనర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు