దేవీ పట్నం, సెప్టెంబర్ 8. VRM Media దుర్గా ప్రసాద్


బిల్డింగ్ ఉన్నఎంపీపీ పాఠశాల ప్రారంభించక పోవడంతో సుమారు ఒక కిలో మీటరు దూరంలో ఉన్న పాఠశాలకు నడిచి వెళ్లి చదువుకుంటున్న విద్యార్థులు.
విద్యాశాఖ అధికారులు స్పందించి పోలవరం ముంపు ప్రాంత విద్యార్థుల భవిష్యత్ ను కాపాడాలి.
పోలవరం ముంపు గ్రామాలలో పాఠశాల భవనాలు తక్షణమే నిర్మించాలి.ఏపీ ఆదివాసీ జేఏసీ.
ఆర్ అండ్ ఆర్ కాలనీ పెద్ద భీం పల్లి 2 పెనికిల పాడు గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాలకు తక్షణమే ఉపాధ్యాయులను నియమించి పాఠశాల ప్రారంభించాలని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా తెల్లం శేఖర్ మాట్లాడుతూ…అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీ పట్నం మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీ పెద్ద భీం పల్లి 2 పెనికిల పాడు గ్రామంలో ఎంపీపీ పాఠశాల భవనం నిర్మించి సుమారు ఐదు సంవత్సరాలు కావస్తున్నా నేటికీ ఉపాధ్యాయులను నియమించి పాఠశాల ప్రారంభించక పోవడంతో పెద్ద భీం పల్లి (ఫజుల బాద్) గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాలకు సుమారు ఒక కిలో మీటరు దూరం మెయిన్ రోడ్డు పక్క నుంచి నడిచి వెళ్లి చదువుకుంటున్న విద్యార్థులకు ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.అలాగే ఇందుకూరు 1 ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఉన్న అగ్రహారం,ఏనుగుల గూడెం,మంటూరు గ్రామాలకు కలిపి విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నపటికీ ఒకే ఎంపీసీ పాఠశాల నందు తరగతులు నిర్వహిస్తున్నారు.మరియు ఒకే అంగన్వాడీ బిల్డింగులో పైన పేర్కొన్న మూడు గ్రామాల పిల్లలు చదువుకుంటున్నారన్నారు.ఇది పోలవరం నిర్వాసితులకు శాస్త్రీయ సమగ్ర పునరావాసం నిబంధనలకు విరుద్ధం అన్నారు.గతంలో ఏవిధంగా అయితే ప్రతి గ్రామంలో పాఠశాలలు,అంగన్వాడి కేంద్రాలు ఉండేయో ఆవిధంగానే బిల్డింగులు నిర్మించి ప్రారంభిచాలన్నారు.ఈ పాఠశాలల విషయమై ఉన్నత అధికారుల దృష్టికి గతంలో తీసుకు వెళ్ళటం జరిగిందన్నారు.ఇప్పటికైన సంబందించిన అధికారులు స్పందించి పోలవరం ముంపు గ్రామాల విద్యార్థుల భవిష్యత్ ను కాపాడాలని డిమాండ్ చేశారు.అలాగే ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి సోడే మురళి మాట్లాడుతూ… రంపచోడవరం,దేవి పట్నం,గంగ వరం మండాలలో కోయ భాష మాట్లాడే విద్యార్థుల కోసం ప్రాథమిక దశ నుండే కోయ భాష పరిరక్షణ కోసం ప్రభుత్వం వారు కోయ భాష వాలంటీర్లు ను ప్రతి పాఠశాలలో నియమించి కోయ భాష పరిరక్షణ కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కారం రామన్న దొర,మండల కార్యదర్శి యలగాడ నాగేశ్వరావు మొదలైన వారు పాల్గొన్నారు.