Vrm media ప్రతినిధి రవికుమార్ ఖమ్మం

ఖమ్మం జిల్లా కోర్టు ముందు ప్రధాన రహదారిపై ప్రతిరోజూ వాహన రద్దీ అధికంగా ఉంటుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం వలన న్యాయవాదులు, వాదీనివాదులు, కోర్టు సిబ్బంది, అలాగే సాధారణ ప్రజలు రహదారి దాటేటప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళలు, వృద్ధులు, వికలాంగులు వంటి వారు ప్రత్యేకించి ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది.
న్యాయసేవల ప్రాప్తి, కోర్టు సందర్శకుల భద్రత పరిరక్షణ దృష్ట్యా, ఖమ్మం జిల్లా కోర్టు ఎదుట అత్యవసరంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఖమ్మం పోలీస్ కమిషనర్‌గారికి విజ్ఞప్తి చేయాలని కోరుతున్నాము.
ఈ చిన్న చర్య ద్వారా కోర్టు ప్రాంగణం పరిసర ప్రాంతాలలో ప్రజల భద్రత, సౌకర్యం గణనీయంగా మెరుగుపడుతుంది.
కార్యక్రమంలో సింగం జనార్దన్
టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ పాల్గొన్నారు.