
రాజంపేటVRM న్యూస్ రిపోర్టర్ సెప్టెంబర్ 11
రాజంపేట లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు స్వామి వివేకానంద విగ్రహానికి బీజేవైఎం మండల అధ్యక్షులు పత్తిపాటి నవీన్ కుమార్ అధ్యక్షతన పుష్పాంజలి ఘటించడం జరిగింది ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్చార్జి పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ 132 సంవత్సరాల క్రితం ఇదే రోజు 1893 సెప్టెంబర్ 11వ తేదీన ప్రపంచ మహాసభల్లో భారత దేశ వానిని వినిపించిన రోజు నేడు ఒక సాధారణ వ్యక్తిగా వెళ్లి వారి ఉపన్యాసంతో ప్రపంచ దేశాల ముందు భారత కీర్తిని ఇనుముడింపజేసిన మహనీయుడు శ్రీ స్వామి వివేకానంద అని అన్నారు. తన ప్రసంగం మొదటిలోనే అమెరికన్ సోదర సోదరీమణులారా మాకు మీరు ఇచ్చిన మనోపూర్వకమైన స్వాగతాన్ని పురస్కరించుకొని ఈ సమయంలో మీతో మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది ప్రపంచంలోని అత్యంత ప్రాచీన ఎతి సంప్రదాయం తరఫున మీకు నా అభివాదాలు సమస్త మతాలకు సమస్త ధర్మాలకు తల్లి అన్న దగ్గర సనాతన ధర్మం పేరా మీకు నా అభివాదాలు నానాజాతులతో నానా సంప్రదాయాలతో కూడిన భారతదేశ జనం తరపున మీకు నా అభివాదాలు అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించి ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసే విధంగా అనర్గళంగా తన ప్రసంగాన్ని పూర్తిచేయడం ఏదైతే ఉందో ఈరోజు సెప్టెంబర్ 11న దాన్ని గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పురుషోత్తం వైస్ ప్రిన్సిపల్ నర్సయ్య గారు బిజెపి రాష్ట్ర అధికార ఓబిసి ప్రతినిధి పట్టుపోగుల ఆదినారాయణ బీజేవైఎం మండల అధ్యక్షుడు పత్తిపాటి నవీన్ కుమార్ బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు రమణారెడ్డి బిజెపి మండల ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయుడు బీజేపీ సీనియర్ నాయకులు హిమగిరి యాదవ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు