
సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ సెప్టెంబర్ 12
కడప జిల్లా టక్కోలు పంచాయతీ పరిధిలోని ఖాజిపల్లి గ్రామంలో ఈరోజు చెత్త సేకరణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ కార్యదర్శి శ్రీ నాగముని రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీ నాగలింగేశ్వర్ రెడ్డి, డ్వాక్రా గ్రూప్ లీడర్ శ్రీ మహేశ్వరీ కలిసి గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రజలకు తడి చెత్త–పొడి చెత్త వేర్వేరుగా వర్గీకరించాల్సిన అవసరం, దాని ప్రయోజనాలు వివరించారు.
ప్రజలకు చెత్త సేకరణ విధానం, శుభ్రతతో వచ్చే ఆరోగ్య పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ గురించి తెలియజేశారు. అదేవిధంగా, పంచాయతీ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుతూ, IVRS కాల్స్ ద్వారా కూడా సమాచారం అందించబడుతుందని గ్రామస్థులకు వివరించారు.
గ్రామం శుభ్రంగా ఉంటే వ్యాధులు దూరమవుతాయని, పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.