Home ఆంధ్రప్రదేశ్ మాటల మాంత్రికుడు – మన ‘సుకవి’ ఆత్రేయజీవిత తత్వాన్ని గుట్టు విప్పిన గేయ రచయితఆచార్య మూల మల్లికార్జున రెడ్డి

మాటల మాంత్రికుడు – మన ‘సుకవి’ ఆత్రేయజీవిత తత్వాన్ని గుట్టు విప్పిన గేయ రచయితఆచార్య మూల మల్లికార్జున రెడ్డి

by VRM Media
0 comments

కడప కల్చరల్ VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ సెప్టెంబర్ 13:

సినిమాల్లో మనసుకు సంబంధించి న పాటలు ఎక్కువగా రాసి, మానవ జీవిత తత్వాన్ని గుట్టు విప్పిన ఆత్రే య’ మనసు కవి’గా, మన’ సుకవి ‘గా ప్రసిద్ధుల య్యారని వైయస్సార్ కడప జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఆచార్య మూల మల్లికా ర్జున రెడ్డి అన్నారు. వైయస్సార్ కడప జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో శనివారం స్థానిక కడప రాజీవ్ కల్చరల్ క్లబ్ కార్యా లయంలో ఆచార్య ఆత్రేయ 36వ వర్ధంతిని ఘనంగా నిర్వహించా రు.మల్లికా ర్జున రెడ్డి మాట్లాడుతూ నాటక రచయితగా,రంగస్థల నటుడిగా ప్రత్యేక గుర్తింపును సంపాదించు కున్న ఆత్రేయ సినిమా రంగంలో ప్రవేశించి దర్శకుడిగా, నిర్మా తగా,పాటలు, సంభాషణల రచయితగా గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారని, ఆయన సినిమా ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించి వారిగుండెల్లో పదిలమైన స్థానం సంపాదించారన్నారు. మొదటి సారిగా దీక్ష సినిమాకు పాటలు రాసిన ఆత్రేయ 400 సినిమాలకు దాదాపుగా1400 పాటలు రాశా రని,ప్రతిపాట మన మనసుని తాకి ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. డాక్టర్ వెల్లాల వెంకటేశ్వ రాచారి ప్రసంగిస్తూ ఆత్రేయ పరివర్తన, ఎన్జీవో,కప్పలు, ఈనా డు, విశ్వ శాంతి, భయం, మాయ, సామ్రాట్ అశోక,గౌతమ బుద్ధ మొదలైన నాటకాలు రాశారని, ఆయన రాసిన నాటకాలు, నాటి కలు వందలసార్లు ప్రదర్శింపబడి ప్రేక్షకాదరణ పొందాయన్నారు. దాసరి సుధాకర్ మాట్లాడుతూ ఆత్రేయ పాటలు రాసిన మంచి మనసులు, డాక్టర్ చక్రవర్తి, బడిపంతులు, మూగమన సులు,ప్రేమనగర్, స్వాతిముత్యం, అంతులేని కథ,మరోచరిత్ర మొదలైన గొప్ప చిత్రాలు ఆయన పాటలతోనే విజయం సాధించా యని చెప్పడంలో అతిశయోక్తి లేదన్నారు. ఎం సత్యనారాయణ ప్రసంగిస్తూ శిలలపై శిల్పాలు చెక్కినారు… ముద్దబంతి పువ్వులో నేనొక ప్రేమ పిపాసిని నేను పుట్టా ను.. కళ్ళలో ఉన్నదమో.. మొదలైన వందలాది పాటలు ప్రేక్షక హృద యాన్ని పరవశంతో ఓలలాడిం చాయన్నారు. ఏ శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఆత్రేయ జీవితాన్ని కాచి వడపోసిన నగ్నసత్యాలు చెప్పారని, అవి ప్రతి వ్యక్తికి మార్గదర్శకాలన్నారు.కార్యక్రమం లో కళాకారులు రామనపల్లి శంకర్, వీరదాసరి ప్రకాష్, యడవల్లి రామ లింగయ్య, మందల చిన్నయ్య, గడికోట రెడ్డయ్య, మందల మురళి, ఎం వెంకటసుబ్బయ్య, ఎన్ రామ సుబ్బారెడ్డి, బి బాల ఓబయ్య, ఎస్ వీరయ్య పాల్గొన్నారు.

2,845 Views

You may also like

Leave a Comment