


కడప జిల్లాVRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ సెప్టెంబర్ 14
కడప జిల్లా దూదేకుల సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ 157 బార్ 1983 వారి ద్వారా ఈరోజు కడప నగరం ఎర్రముక్కపల్లె సర్కిల్ దగ్గర దూదేకుల భవనంలో రాష్ట్ర నూర్ భాషా దూదేకుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన శ్రీ డాక్టర్ నాగూరు వీరభద్రుడు మండపంపల్లి ఎంపీటీసీ, జిల్లా దూదేకుల అసోసియేషన్ అధ్యక్షుడు సింకేసుల భాష అధ్యక్షతన శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆ సంఘం పెద్దలు కమిటీ మెంబర్లు మాట్లాడుతూj మనందరికీ సుపరిచితుడు నాగూరు వీరభద్రుడు డైరెక్టర్ పోస్టు రావడం చాలా సంతోషకరమని, మన దూదేకుల సంఘీయులకు ఉన్న చిన్న చిన్న పొరపత్యాలను విడనాడి మన సమస్యలను స్టేట్ డైరెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని, వారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి ప్రతి సమస్యను పరిష్కరించు కోవాలని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా స్టేట్ డైరెక్టర్ డాక్టర్ నాగూరు వీరభద్రుడు మాట్లాడుతూ గత రెండు రోజులుగా జరుగుతున్న సన్మానాల ద్వారా నాకు మన కుల పెద్దలు ఇస్తున్న అపూర్వ గౌరవాన్ని నేను బాధ్యతగా స్వీకరించి మన దూదేకుల సంఘీయులకు అన్ని రకాలుగా ముందుండి ఆదుకుంటానని, నా దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని ప్రభుత్వానికి వివరించి కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందే విధంగా చర్యలు తీసుకుంటారని ప్రభాముఖంగా తెలియజేశారు. కాగా మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దూదేకుల ఫెడరేషన్ గా మాత్రమే ఉన్న మన కుల సంఘాలను గుర్తించి మొట్టమొదటిసారిగా కార్పొరేషన్లను కేటాయించి వాటికి నిధులను సమకూర్చి దూదేకులను గుర్తించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్నిచ్చిన పార్టీకి నా దూదేకుల కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కల్లూరు ఖాదర్బాషా, కల్లూరి చిన్నబాదల్లా, తొండూరు చిన్నబాబు, ఆటోబాబు, బాబు సాహెబ్, బాబయ్య,చౌడయ్య,పుల్లయ్య, ఖాదరయ్య, రాజన్న, కులయప్ప, హుస్సేన్, కమల్ భాష, బాబయ్య, మహమ్మద్ హుస్సేన్, కేపీ హుస్సేన్ సాబ్, మస్తాన్ సాబ్, చెన్నకేశవులు,మహీం,చిన్నరాజా,షహీం తదితర జిల్లా దూదేకుల పెద్దలు సంఘం పెద్దలు పాల్గొన్నారు.