


కడప జిల్లాVRM న్యూస్ స్టాప్ రిపోర్టర్ ఈశ్వర్ సెప్టెంబర్ 14
ఈరోజు కడప నగరంలోని చిన్నచౌక మెయిన్ రోడ్డులో సాయి అక్షిత ప్రధమ చికిత్స కేంద్రం నందు రాష్ట్ర నూర్ భాషా దూరేకుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమింపబడ్డ మాధవరం వన్ ఆర్ఎంపీ డాక్టర్ నాగూరు వీరభద్రుడు కడప జిల్లా ఆర్ఎంపి అండ్ పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ వారు నగర కమిటీ వారు కలిపి గ్రాండ్గా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ వారు మాట్లాడుతూ మన తోటి తెలుగుదేశం పార్టీకి పనిచేస్తూ మన ఆర్ఎంపీ వ్యవస్థకు ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాల అందించాలని స్టేట్ డైరెక్టర్గా నియమితులైన వీరభద్రుడు కోరారు.
స్టేట్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మన ఆర్ఎంపి సోదరుల కష్టాలు బాధలు నాకు తెలుసునని మన కష్టాలను వీలైనంతవరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంతవరకు ఆర్ఎంపీ సోదరులకు మంచి జరిగే విధంగా చర్యలు తీసుకుంటానని సభాముఖంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, జనరల్ సెక్రెటరీ శివకుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రమౌళి ఫార్మసీ జెహెచ్సి చైర్మన్ సురేష్ తదితర ఆర్ఎంపి అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లె గాలివీడు రామాపురం మండలాల మార్కెట్ యాడ్ చైర్మన్గా నియమితులైన లక్కిరెడ్డిపల్లె ఆర్.ఎం.పి డాక్టర్ షఫీ నాయక్ గారిని కూడా ఈ సందర్భంగా సన్మానం జరిగింది.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird