Home ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో

పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో

by VRM Media
0 comments

పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో కోరుకొండ మండలం ప్రభుత్వ పాఠశాల నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత ఉపకరణములు నిర్ధారణ శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు… వీరితో పాటు ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు గారు పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు మాట్లాడుతూ మనలో కొంతమందికి అపోహలు ఉన్నాయి. అవి మానసికంగా గాని, శారీరకంగా గాని వికలాంగులని ఇంటికే పరిమితం చేసేస్తున్నాం..వారి ఇంటికి పరిమితం చేసినపుడు వారిలో మార్పు రావడం అసాధ్యం . ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుంది. ఎవరికైతే ఫీజియో తెరఫీ అవసరం ఉంటుందో వారికి థెరపీ చేయిస్తున్నాము, పరికరాలను అందిస్తున్నాము. వారికి అన్నిరకాలుగా సహాయంగా ఉంటూ వారి సొంత కాళ్ళ మీద వారు నిలబడేలా చేసి వారికి ఉపాధి కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వం ధ్యేయం. మనము వారిని ప్రోత్సహిస్తే వారిలో దాగి ఉన్న ప్రతిభను మనము వెలికితీయవచ్చు. పరీక్షలలో ఒక అంధురాలు జిల్లా ఫస్ట్ వచ్చింది అంటే ఆ కష్టం వెనుక ఎంత శ్రమ, ప్రోత్సాహం ఉందొ మనమందరం తెలుసుకోవాలి. మానసికంగా వారు ఎంత దృడంగా ఉన్నారో మనకు అర్ధమవుతుంది. తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలి. మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయండి అని తెలియజేసారు..

ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు , ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

2,833 Views

You may also like

Leave a Comment