Vrm media ప్రతినిధి ఖమ్మం



ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలో ప్రజలకు తక్షణ పరిష్కారాలను అందించాలనే ఉద్దేశంతో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడింది.
మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య గారు, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ కలిసి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
📍 కొత్త మున్సిపల్ కార్యాలయం
📍 నార్త్ జోన్ – బల్లేపల్లి నార్త్ జోనల్ కార్యాలయం
📍 సౌత్ జోన్ – పాత మున్సిపల్ కార్యాలయం
ఈ మూడు ముఖ్య జోన్లలో ప్రజల నుండి వచ్చిన వివిధ ఫిర్యాదులు, అభ్యర్థనలు స్వీకరించి, కమిషనర్ గారు స్వయంగా సంబంధిత విభాగాధిపతులతో చర్చించి తక్షణ చర్యలకు సూచనలు జారీ చేశారు.
కార్యక్రమంలో వార్డు అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ అధికారులు, సానిటేషన్ సిబ్బంది కలిసి సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మొత్తం 34 అప్లికేషన్స్ వచ్చాయి
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird