👉మార్చి నెల గోకవరంలో జరిగిన గ్రామ దేవత మాతృశ్రీ గుబ్బాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు సందర్భంగా విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు మహిళలకు లక్కీ డ్రా నిర్వహించి, గెలుపొందిన విజేతలకు పట్టు చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టి, 600 మందికి పట్టు చీరలు ఉచితంగా పంపిణీ చేసారు.
👉ఆ రోజు లక్కీ డ్రాలో గెలుపొందిన వారికే కాకుండా పేర్లు నమోదు చేసుకుని లక్కీ డ్రాలో పట్టుచీర వస్తుందని, ఆశతో అర్ధరాత్రి వరకు పడి గాపులు కాస్తూ వేచి ఉన్న మహిళల కష్టాన్ని గుర్తించిన, కంబాల శ్రీనివాసరావు పేర్లు నమోదు చేసుకున్న మహిళలందరికీ కూడా పట్టు చీరలు త్వరలోనే పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు.
👉దీనిలో భాగంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా కంబాల కానుక వనితల వేడుక అనే కార్యక్రమం ద్వారా శనివారం స్థానిక సూర్య ఫంక్షన్ హాల్ లో 2,000 వేలు మంది మహిళలకు కంబాల శ్రీనివాసరావు గారు పట్టు చీరలను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు, తదితరులు పాల్గొన్నారు..