

సిద్దోటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ సెప్టెంబర్ 22
పౌష్టికాహార మాసోత్సవాల సందర్భంగా మండల కేంద్రమైన సిద్ధవటం బీసీ బాలుర వసతి గృహం ప్రాంగణంలో సోమవారం గర్భవతులకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిడిపిఓ శ్రీవాణి మాట్లాడుతూ సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించే పౌష్టికాహార మాసోత్సవాల సందర్భంగా గర్భం దాల్చిన గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సలహాలు సూచించి ఇద్దరు గర్భవతులకు శ్రీమంత కార్యక్రమం ఆరు నెలలు నిండిన బిడ్డకు అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించామని అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి ముర్రిపాలు తాపితే బిడ్డ ఆరోగ్యవంతులుగా ఉంటారని గర్భవతులు పోషక ఆహారం తీసుకుంటే పూర్తిగా ఆరోగ్య వంతులుగా ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో పి కొత్తపల్లి వైద్యాధికారి డాక్టర్ రంగ లక్ష్మి ఐసిడిఎస్ సూపర్వైజర్ వరలక్ష్మి అంగన్వాడి కార్యకర్తల వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు