

కడపVRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ ఈశ్వర్ పి సెప్టెంబర్ 24:
కడప ఇంతవరకు తెలుగు సాహిత్యం లోకం లో ప్రచురించని అరుదైన తాళపత్ర గ్రంథాలు వైయస్సార్ కడప జిల్లా, కడప పట్టణం లోలభించినట్లు యోగి వేమన విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు, సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం పూర్వ సంచాలకులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి పెండ్లిమర్రి మల్లయ్య పిలుపు మేరకు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి, ప్రసిద్ధ కవి,వైయస్సార్ జిల్లా రచయితల సంఘం కార్యవర్గ సభ్యులు డాక్టర్ వెల్లాల వెంకటేశ్వరాచారి మృత్యుంజయ కుంట శివాలయం పక్క వీధిలో ఉన్న మల్లయ్య స్వగృహం వెళ్లి ఆయన పూర్వీకుల నుండి వస్తున్న నాలుగు తాళపత్ర గ్రంథాలను పరిశీలించి,స్వీకరించారు. ఈ సందర్భంగా మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ ఈ తాళపత్ర గ్రంథాలు చాలా ప్రాచీనమైనవని, ఇవి పూర్తిగా ఆధ్యాత్మికమైన జ్ఞాన గ్రంథాలని. ఈ తాళపత్ర గ్రంథాలను ఎవరు రాశారో, ఎప్పుడు రాశారో తెలియదని, ఆయా కవుల పేర్లు ప్రస్తావించలేదని, ఈ నాలుగు తాళ పత్రాల్లో మోక్షం,పరమార్థం,పరమపదం, పురుషార్థం, ధ్యానం, యోగం, సమాధి,తపస్సు తత్వ వేత్త, సాంఖ్యం, ధ్యానం, ద్వైతం,అద్వైతం,విశిష్టాద్వైతం నిధిద్యాసం, ఉపనయనం, ఆచమనం,విభూతి, తీర్థం,రుద్రాక్ష, నారికేళం, ధారా పాత్ర, అఖండలం, ధారా పాత్ర, ఘంటా నాదాలతో పాటు స్థూల సూక్ష్మ శరీరాలు, పంచకోష కోశ వివరణ,షమాధి షట్కమ్, సోహం తదితర అంశాలు,పంచ ముద్రలు, ఆశ్రమ ధర్మాలు, అంతఃకరణ చతుష్టయం మొదలైన ఆధ్యాత్మిక జ్ఞాన రహస్యాలు ఎన్నో ఈ తాళపత్ర గ్రంథాల్లో ఉన్నాయని అన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird