Home వార్తలుఖమ్మం “చలో మానుకోట జయప్రదం చేయండి జాటోత్ భాస్కర్ నాయక్ లంబాడా ఉద్యోగ జేఏసీ రాష్ట్ర నాయకులు”

“చలో మానుకోట జయప్రదం చేయండి జాటోత్ భాస్కర్ నాయక్ లంబాడా ఉద్యోగ జేఏసీ రాష్ట్ర నాయకులు”

by VRM Media
0 comments

Vrm media ఖమ్మం ప్రతినిధి

ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం రాములు తండాలో బానోతు చంద్రం నాయక అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర లంబాడ ఉద్యోగ జేఏసీ రాష్ట్ర నాయకులు జాటో భాస్కర్ నాయక్ ఖమ్మం జిల్లా లంబడ జేఏసీ నాయకులు బానోతు కిషన్ నాయక్ మాట్లాడుతూ లంబాడీల పైన జరుగుతున్న కుట్రలను ఛేదిస్తూ అసత్య ప్రచారాలను నిరసిస్తూ లంబాడ శాంతి ర్యాలీ చలో మానుకోట ఈనెల 28వ తారీఖు నాడు జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈరోజు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రాములు తండాలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ లంబాడీలు అడ్డదారిన దొడ్డిదారిన వచ్చారని మా సాటి మిత్రులు ఆదివాసి సోదరులు మాట్లాడుతున్న మాటలు ఏ మాత్రం సత్యం కాదని అసత్యాన్ని ప్రచారం చేస్తూ వారిని వారే మోసం చేసుకుంటున్నారు ఇది గమనించాలి లంబాడీలు వారి కష్టాన్ని నమ్ముకుని వ్యవసాయమే జీవన ఆధారంగా చేసుకుంటూ ఎంత కష్టాన్నయినా భరిస్తూ బిడ్డల్ని ఉన్నత చదువులు చదివించుకుంటూ తద్వారా విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను ఉపయోగించుకుంటున్నారు తప్ప వేరే ఒకరి కష్టాన్ని కొల్లగొట్టే పద్ధతి మా జాతికి లేదని స్పష్టం చేశారు 1976 లో లంబాడీలు ఎస్టీ జాబితాలో చేర్చబడితే అంతకుముందు దాదాపుగా 26 ఏళ్ల రిజర్వేషన్ను వారొక్కరే అనుభవించి మల్ల తప్పుడు ప్రచారం చేస్తూ కోర్టులకు ఎక్కుతూ రాజకీయ నిరుద్యోగులు సృష్టిస్తున్న సత్య దూరమైన ప్రకటనలను వల్లిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు తప్ప మరొకటి కాదన్నారు మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా మేము చేస్తున్న ఆత్మగౌరవ పోరాటానికి ప్రజలు ప్రజాస్వామికవాదులు మద్దతును ఇవ్వాలని వారు కోరారు మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన మానుకోట గడ్డమీద లంబాడి బిడ్డల ఆత్మగౌరవ శాంతి ర్యాలీనీ జయప్రదం చేయాలని ఖమ్మం జిల్లా లంబాడి తండాలు తిరుగుతూ ప్రచారం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సక్రాం నాయక్ బోడ తౌర్య నాయక్ రాందాస్ నాయక్ బానోతు తౌరియా నాయక్ బోడా హట్యా నాయక్ చందు నాయక్ స్వామి నాయక్, బాబురావు నాయక్ బోడ హుస్సేన్ నాయక్ భానోత్ బిక్షం ధన సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

2,845 Views

You may also like

Leave a Comment