

కడప VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ సెప్టెంబర్ 27:
కడప పాత మున్సిపల్ ఆఫీసు ప్రాంగణాన్ని అందమైన పార్కుగా ఏర్పాటు చేసి దానికి పర్యాటక పితామహులు సిద్ధవటం సీతారా మయ్య పేరు పెట్టాలని దక్షిణ భారత పర్యాటక సంస్థ జాతీయ ఉపాధ్యక్షులు విద్యాన్ గానుగ పెంట హనుమంత రావు, సంస్థ జిల్లా గౌరవ అధ్యక్షులు న్యాయ సలహాదారులు సట్టి భారవి లు అన్నారు శనివారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా పాత మునిసిపల్ ఆఫీసు లో ఉన్న భారత రాజముద్రిక విజేస్తూపం వద్ద వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ స్థలాన్ని సిద్ధవటం సీతారా మయ్య స్మారక పార్కుగా ఏర్పాటు చేసి నగర ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వం పై అటు జిల్లా యంత్రాంగం పై ఉందని తెలిపారు.రాయలసీమలో అరుదైన భారత రాజముద్రికస్తూపం ఇక్కడ ఉండడం విశేషమన్నారు.దీని చుట్టూ 20 అడుగుల వృత్తాకారంలో సర్కిల్ తో థీమ్ పార్క్ గా అభివృద్ధి చేయాలని కోరారు.గతంలో ఈ ప్రాంతానికి పై భాగంలో గాంధీ పార్క్ ఉండేదని, ప్రస్తుతం పెట్రోల్ బంకును ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ ప్రాంతంలో పార్కు లేక పోవడం వల్ల ప్రజలు, వృద్ధులు విశ్రాంతి తీసుకోవడాని చాలా ఇబ్బందులు గురవుతు న్నారని అన్నారు.అరుదైన వారసత్వ సంపద రాయలసీమ నడిబడ్డలో ఉండడం మనకు ఎంతో గర్వకారణమని చెప్పారు ఈ అశోక్ చక్ర స్థూపానికి సముచిత గౌరవం ఇచ్చి కడప వైభవానికి సూచికగా ఉన్న దీనిని వారసత్వ సంపదగా గుర్తించి రక్షణ కల్పించాలని కోరారు.ఈ స్థలాన్ని సుందరీకరణ చేసి యువతలో దేశభక్తి పెంపొందించే చర్యలు తీసుకోవాలని అన్నారు.రాబోవు కాలంలో గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత కడప నగరపాలక సంస్థ పై ఉందన్నారు కడపకు తలమానికంగా ఉండటమే గాక, జాతీయ సమైక్యతకు సార్వభౌమత్వానికి ప్రతీక అయినా రాజముద్రిక విషయంలోమే ధావులందరూ, ప్రజా ప్రతినిధులు, సంఘ సేవకులు చొరవ చూపి సుందరమైన, విశాలమైన విజయిస్తుప పార్కుకు సహకారం అందించాలని కోరారు. అనంతరం ప్రముఖ ప్రవచనకర్త మాడుగుల శివశ్రీ శర్మ మాట్లాడుతూ విజయ స్తూప ప్రాముఖ్యతను భారతదేశ కీర్తి పతాకాన్ని పద్య రూపంలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు జ్యోతి జార్జ్, కార్యదర్శి శ్రీనివాసులు , ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షులు మోడపోతుల సత్యనారాయణ గాంధీ, ఇంటాక్ సీనియర్ సభ్యులు, శివ స్టూడియో అధినేత, శివ, రాఘ వేంద్ర వర్మ,రవి తదితరులు పాల్గొ న్నారు.