Home ఆంధ్రప్రదేశ్ పొన్నవోలు కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో స్వస్థనారి సశక్తి పరివార్ కార్యక్రమా

పొన్నవోలు కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో స్వస్థనారి సశక్తి పరివార్ కార్యక్రమా

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ సెప్టెంబర్ 27

సిద్ధవటం మండలం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు సార్ మరియు ఎన్సిడి/ఆర్ బి ఎస్ కే నోడల్ ఆఫీసర్ డాక్టర్ జె ప్రవీణ్ కుమార్ గారు మరియు పొన్నవోలుకొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిణి పి రంగలక్ష్మి గారు రిబ్బన్ కటింగ్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది ఈ కార్యక్రమంలో గర్భవతులకు పౌష్టికాహారం గురించి మరియు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గర్భవతులకు వివరించడం జరిగినది చిన్నపిల్లలకు టీకాలు వేయడం ఆ టీకాలు వేయడం వల్ల పిల్లలకు వచ్చే ప్రాణాంతకమైన వ్యాధుల నుండి కాపాడుకోవచ్చునని మరియు వృద్ధులకు మధుమేహం రక్తపోటు పరీక్షలు చేయడం జరిగినది యుక్త వయసు బాలికలకు పీరియడ్స్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బాలికలకు వైద్యాధికారులు వివరించడం జరిగినది అక్కడ ప్రజలకు రొమ్ము క్యాన్సర్ నోటి క్యాన్సర్ గర్భాశయ ము ఖద్వారా క్యాన్సర్ గురించి అవి ఎలా వస్తాయో ఏ కారణాల వల్ల వస్తాయో వివరించడం జరిగినది సిద్ధపటం సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు గారు అక్కడి ప్రజలకు మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా లాంటి జ్వరాలు ఎలా వస్తాయో అవి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని వివరించడం జరిగినది మధుమేహం రక్తపోటు కలవారు తప్పనిసరిగా క్షయపరీక్షలు చేసుకోవాలని ఈ జబ్బు ప్రారంభ దశలో కనుక్కొని వైద్యం చేయించుకుంటే తప్పక నయం అవుతుందని క్షయ క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తే ఎవరు కూడా భయపడనవసరం లేదని సరైన సమయంలో చికిత్స చేయించుకుంటే నయమవుతుందని అక్కడ ప్రజలకు వివరించడం జరిగినది మరియు యుక్త వయసు వారికి గర్భవతులకు బాలింతలకు రక్త పరీక్షలు హిమోగ్లోబిన్ పరీక్షలు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మానసిక వ్యాధి వైద్య నిపుణులు పి సందీప్ ప్రసూతి వైద్యురాలు హర్షిత కంటి వైద్య నిపుణులు కల్పనా చిన్న పిల్లల వైద్యనిపుణులు మంజుల గారు జనరల్ మెడిసిన్ సూర్య ప్రకాష్ ఆప్తమాలజిస్ట్ యూనిస్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లక్ష్మీనరసమ్మ గారు హెల్త్ సూపర్వైజర్ లక్ష్మీదేవి మౌలాలి ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది పాల్గొనడం జరిగినది ఈ కార్యక్రమం అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు సార్ వైద్య సిబ్బంది మరియు ప్రజలతో స్వచ్ఛనారి శశక్త్ పరివార్ పరివార్ గురించి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది

2,842 Views

You may also like

Leave a Comment