
VRM న్యూస్ అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ రవిబాబు సెప్టెంబర్ 28
రాజంపేట నియోజకవర్గం.
నేడు శనివారం రాజంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను జింక శివ శంకరయ్య 40.100, సోమిశెట్టి రేవతి 40.227, రాయపరాజు చిన్న పెంచల్ రాజు77000, కాశిరెడ్డి నరసింహారెడ్డి 20227 రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి వారి అవసరాలకు అనుగుణంగా వైద్య ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొన్న బాధితులకు చేయూత అందించడమే మన కూటమి ప్రభుత్వ లక్ష్యం. బాధితులు మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్ నందు వైద్య ఖర్చులు భారంగా ఉండడంవల్ల మాకు ఆర్థికంగా కూటమి ప్రభుత్వం తరఫున మన ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు రాజంపేట టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్ రాజు సహాయం చేయడం వల్ల మేము వారికి ఎప్పుడు రుణపడి ఉంటామని అలాగే వారికి ధన్యవాదాలు తెలుపడం జరిగినది.