

పిఠాపురం,వి.ఆర్.ఎం.న్యూస్ 24,ప్రతినిధి,ప్రిన్స్,అక్టోబర్, 1:-
కాకినాడ జిల్లా
పిఠాపురం నియోజకవర్గం
ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్దుర్తి గ్రామ సర్పంచ్ సూర్నీడి సూర్యప్రసాద్ అన్నారు.
పిఠాపురం మండలం వెల్దుర్తి గ్రామంలో నూతన పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ సూర్నీడి సూర్య ప్రసాద్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కష్టకాలంలో ఉన్నప్పటికీ మాటకు కట్టుబడి ప్రతిష్టాత్మకంగా
పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపడుతుందని ఆయన తెలిపారు ఇదే క్రమంలో గత ప్రభుత్వం కేవలం తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారని ఆయన ఎద్దేవా చేశారు
ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు ఉలిశెట్టి ఆనంద్ సూర్నీడి వెంకటేశ్వరరావు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird