

VRM మీడియా న్యూస్
రిపోర్టర్:- లక్ష్మయ్య
సత్తుపల్లి
ఖమ్మం జిల్లా
Date 02/10/2025 న
విజయదశమి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు శుక్రవారం ఉదయం దమ్మపేట మండల పరిధిలోని నాచారం, వడ్లగూడెం గ్రామాల్లోని దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నాచారం గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజల భక్తి కేంద్రంగా నిలిచిన శ్రీ జగదాంబ తల్లి అమ్మవారి ఆలయాన్ని, అలాగే లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని దర్శించి పూజలు చేశారు. అనంతరం వడ్లగూడెం గ్రామంలోని పురాతన శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల ఆయా దేవాలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై కమిటీ సభ్యులతో సమీక్ష చేపట్టారు. స్థానిక అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం కృషి చేస్తుందని భక్తులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో దమ్మపేట మండల సీనియర్ నాయకులు పైడి వెంకటేశ్వరరావు, అచ్యుతరావు, దమ్మపేట సొసైటీ చైర్మన్ రాఘవరావు, మురళి, తాళ్లూరి రాఘవరావు, సత్తుపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు చల్లగుళ్ళ నరసింహారావు, విద్యాసంస్థల అధినేత చలసాని సాంబశివరావు, పువ్వాళ్ళ ఉమా తదితరులు పాల్గొన్నారు.
–