Home ఆంధ్రప్రదేశ్ మహాత్ముని సేవలు మరువలేనివి-జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాలరామయ్య

మహాత్ముని సేవలు మరువలేనివి-జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాలరామయ్య

by VRM Media
0 comments

సిద్దవటం VRM న్యూస్ రిపోర్టర్ అక్టోబర్ 2

అహింసే ఆయుధంగా దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహానీయుడు మహాత్మా గాంధీ అని,ఆయన సేవలు చిరస్మరణీయమని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య అన్నారు.జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని సిద్ధవటం మండలం ఉప్పరపల్లె గ్రామంలో గురువారం రాటాల రామయ్య గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు.ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ సుపరిపాలన ద్వారా గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా గాంధీ కలలు కన్నారని అన్నారు. ఆయన ఆశయ సాధనలో ప్రతిఒక్కరూ దేశం కోసం పాటుపడాలన్నారు. మహాత్ముడి పూర్తిగా తీసుకొని యువత ముందుకు నడవాలన్నారు. అనంతరం శాంతియుత మార్గం ద్వారానే ఏదైనా సాధించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు పాల్గొన్నారు.

2,819 Views

You may also like

Leave a Comment