Home ఆంధ్రప్రదేశ్ 13వ తేదీన జరిగే రంపచోడవరం ఐటీడీఏ ముట్టడి కార్యక్రమానికి ఆదివాసులు అందరూ తరలిరండి.ఆదివాసి హక్కుల ఉద్యోగాల సాధన కమిటీ పిలుపు.

13వ తేదీన జరిగే రంపచోడవరం ఐటీడీఏ ముట్టడి కార్యక్రమానికి ఆదివాసులు అందరూ తరలిరండి.ఆదివాసి హక్కుల ఉద్యోగాల సాధన కమిటీ పిలుపు.

by VRM Media
0 comments

దేవీపట్నం, అక్టోబర్ 2.

ఆదివాసులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారణకై ఈనెల 13వ తేదీన రంపచోడవరం ఐటిడిఏ ముట్టడి కార్యక్రమానికి ఆదివాసులందరూ తరలిరావాలని ఆదివాసీ హక్కుల ఉద్యోగాల సాధన కమిటీ డివిజన్ ప్రెసిడెంట్ మడి మురళి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మడి మురళి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీపట్నం మండలం పరిధిలోని పెద్ద భీం పల్లి -2, పెద్ద భీంపల్లి -3 మరియు మడిపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలలో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ సమావేశాల్లో మాట్లాడుతూ… 2025 మెగా డీఎస్సీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడంతో ఆదివాసి నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.ఈ విషయంపై గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీడీఏల వద్ద ధర్నాలు,రాస్తారోకోలు,ర్యాలీలు, రిలే నిరాహార దీక్షలు చేపట్టి 2025 మెగా డీఎస్సీలో ఉన్న షెడ్యూల్డ్ ప్రాంత టీచర్ పోస్టులు మినహాయించి ప్రత్యేక డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదన్నారు.ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆదివాసి నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అదివాసీ ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ లో తీర్మానం చేసి షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం తక్షణమే ప్రకటించి ఆదివాసి ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించాలని,ఆదివాసీ యువతకు ఐటీడీఏ ద్వారా ట్రైకార్ రుణాలు తక్షణమే మంజూరు చేయాలని,ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు 100 శాతం ఆదివాసీ నిరుద్యోగులతో భర్తీ చేయాలని,ఎన్నికల ముందు ఏపీ సీఎం అరకులో ఆదివాసీ నిరుద్యోగులకు జీఓ నెంబర్ 3 ని పునరుద్ధరించి వంద శాతం ఉద్యోగాలు స్థానిక ఆదివాసీ నిరుద్యోగులతో భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని తక్షణమే అమలుచేయాలని,ఆశ్రమ పాఠశాలలో ఏఎన్ఏం పోస్టులు భర్తీ చేయాలని మరియు 1/59,1/70,పెసా చట్టం,అటవీ హక్కుల చట్టం,2013 పోలవరం ప్రాజెక్టు భూ సేకరణ చట్టం పటిష్టంగా అమలు చేయాలని మొదలైన సమస్యలను పరిష్కరించాలని శాంతియుతంగా ఈ నెల 13 వ,తేదీన రంపచోడవరం ఐటీడీఏ ముందు జరిగే ముట్టడి,ర్యాలీ కార్యక్రమాన్నికి అదివాసీప్రజానీకం అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆదివాసి హక్కుల ఉద్యోగాల సాధన కమిటీ మండల ప్రధాన కార్యదర్శి మిర్తి వాడ సాయికిరణ్ రెడ్డి,శారపు నవీన్ కుమార్,మడకం సూర్య కుమారి,మిర్తి వాడ సూరారెడ్డి,రమాదేవి,వరలక్ష్మి, సర్పంచ్ తోకల నాగరత్నం,ఏపీ ఆదివాసి జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కారం రామన్న దొర మొదలైన వారు పాల్గొన్నరన్నారు.

2,820 Views

You may also like

Leave a Comment