
సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ అక్టోబర్ 3
సిద్ధవటం : మండలంలోని టక్కోలు సచివాలయం లో నిర్వహించిన అవగాహన సమావేశంలో రైతులకు EC శిరీష తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అందించే సబ్సిడీ గురించి వివరించారు. ఆయిల్ పామ్ తక్కువ ఖర్చుతో సాగు చేసే అధిక ఆదాయం పొందవచ్చునని రైతులకు వివరించారు. ఉద్ద్యాన శాఖ వారు ఒక హెక్టారుకు రూ. 29,000 విలువ చేసే ఆయిల్ పామ్ మొక్కలు ఉచితంగా అందజేస్తారు. ఒక హెక్టారుకు ఒక సంవత్సరానికి వరకూ పూరుగుల మందులు యాజమాన్యానికి రూ. 5250, అంతర పంటల వేసే రూ. 5250 రాయితీ ఇస్తారని చెప్పారు. ఒకొక్క రైతుకు గరిష్టంగా 10 హెక్టార్ల వరకు వర్తింపజేస్తుందన్నారు. అలాగే టక్కోలు గ్రామంలో ఆయిల్ పామ్ మోగా ప్లాంటేషన్ డ్రైవర్లుగా భాగంగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమం లో పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి , మాజీ vro ముని రెడ్డి, ధర్మసేన రెడ్డి , ఫీల్డ్ అసిస్టెంట్స్, సచివాలయం అధికారులు,రైతులు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.