
VRM న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్
బిఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం మున్సిపాలిటీ పరిధి డి ఎన్ పి ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వేరియా ముఖ్యఅతిథిగా పాల్గొని నాయకులకు, కార్యకర్తలకు స్థానిక ఎన్నికల పై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీపురం (రాళ్ల బంజర) గ్రామానికి చెందిన యువకులు దనేకుల నాగేశ్వరరావు,మాజీ వార్డు సభ్యులు వీర ప్రసాద్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. సండ్ర వెంకట వీరయ్య కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో విఫలమైందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. భూక్య నాగరాజు, ఇస్లావత్ సాయి భూక్య రుప్లా నాయక్, ఇస్లావత్ నాగరాజు తరితరులు పార్టీలో చేరారు.