
ప్రత్తిపాడు, వి.ఆర్.ఎం న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్.అక్టోబర్.4
ఏలేశ్వరం పట్టణంలో లయిన్స్ అధ్యక్షుడు అనుసూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జాతిపిత గాంధీజీ,లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీజీ,బహుదూర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనసూయ నాగేశ్వరరావు మాట్లాడుతూ గాంధీజీ,బహుదూర్ జయంతి ఒకే రోజు అవ్వడం భారతదేశ ప్రజలు గర్వించదగ్గ విషయమని,ఎన్నో త్యాగాలు చేసి, అహింసే మార్గంగా నడుచుకుని భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడం చాలా గర్వకారణం అని, ఇలాంటి మహానుభావులు ఉండబట్టే మనకు స్వతంత్రం వచ్చిందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో లయిన్స్ సభ్యులు అలమండ దుర్గాప్రసాద్, జ్యోతుల శ్రీనివాస్,గొల్లపూడి గణేష్,ఊర రాజబాబు,హరిచంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird