Home ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్ల సేవలో పథకం నిర్వహించిన స్టేట్ డైరెక్టర్ వీరభద్రుడు

ఆటో డ్రైవర్ల సేవలో పథకం నిర్వహించిన స్టేట్ డైరెక్టర్ వీరభద్రుడు

by VRM Media
0 comments

సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ అక్టోబర్ 4

సిద్ధవటం మండలం మాధవరం 2 సచివాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి సూపర్ సిక్స్ కార్యక్రమం అమలు చేస్తున్నారు. దానిలో భాగంగా శ్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పించారు. ఈ పథకం ద్వారా ఆటోవాలాలకు తలెత్తిన ఇబ్బందులను ముందుగానే గుర్తించి వారికి సంవత్సరానికి 15000 అందించే విధంగా మాటిచ్చారు. దానికి అనుగుణంగా ఈరోజు వారికి ఆటో డ్రైవర్ల సేవలో* అనే వినూత్న కార్యక్రమం ప్రవేశపెట్టి ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు 15000 చేరే విధంగా పథకం ప్రారంభించి ప్రతివారికి సంక్షేమ పథకం అందుతుందని మరోసారి నిరూపించారు.
ఈ కార్యక్రమాన్ని రాజంపేట నియోజకవర్గము ఇంచార్జ్ శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో మాధవరం 1 గ్రామంలో రాష్ట్ర నూర్ భాషా దూదేకుల వెల్ఫేర్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ నాగూరు వీరభద్రుడు గారు, గ్రామ సచివాలయ సిబ్బంది తెలుగుదేశం యూనిట్ ఇన్చార్జులు, బూత్ కమిటీ కన్వీనర్స్ మరియు గ్రామ ప్రజలు తదితరులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వీరభద్రుడు గారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 15000 చొప్పున అందించేందుకు ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమం ముందు ముందు ఎంతో గొప్పగా నిర్వహించబడుతుందని ప్రతి పేదవాడికి ప్రభుత్వం తరఫున సంక్షేమ పథకం అందే విధంగా కూటమి ప్రభుత్వం అధికారులను సమయత్తం చేస్తోందని ప్రజల ఆశీర్వాదాలు కూటమి ప్రభుత్వం మీద, నారా చంద్రబాబు నాయుడు మీద ఉండాలని ఆయన కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది విష్ణు, హరీష్ మరియు గ్రామంలోని టిడిపి నాయకులు పెగడ హరి ప్రసాద్,కరమళ్ళ భాష, ఖాదర్ బాషా, మురళి, కమల్ బి, వెంకటసుబ్బయ్య, నరసింహులు, గణేష్ అలాగే ఆటో డ్రైవర్ల సేవలో పథకం లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

2,828 Views

You may also like

Leave a Comment