ఘనంగా కనకదుర్గమ్మ వారి నూతన రథం శిఖర ప్రతిష్టాపన మహోత్సవం
Vrm media
ప్రత్యేక పూజలు, హోమాలు, నిర్వహించిన "కంబాల" దంపతులు
👉భక్తులు విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు
👉దేవిచౌక్ శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారికి 50 లక్షలు రూపాయలు వ్యయంతో ఎంతో అద్భుతంగా తయారు చేయించిన నూతన రథం శిఖర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది.
👉ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్ననం ఒంటి గంట వరకు కంబాల శ్రీనివాసరావు శ్రీమతి పద్మావతి దేవి గంగారత్నం దంపతులచే అర్చకులు వల్లూరి జగన్నాథరావు శర్మ శాస్త్రోక్తంగా, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.
👉అనంతరం దేవిచౌక్ కమిటీ సభ్యులు, సేవకులు, అమ్మ వారి భక్తుల సమక్షంలో శిఖర ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది.