
ప్రత్తిపాడు వి.ఆర్.ఎం న్యూస్24 ప్రిన్స్ ప్రతినిధి అక్టోబర్ 7:–
జీఎస్టీ తగ్గడం వల్ల కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది - ఎమ్మెల్యే సత్యప్రభ
ఈరోజు ప్రతిపాడు మండలం వొమ్మంగి గ్రామంలో జీఎస్టీ 2.0 నూతన స్లాబ్ విధానంపై ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.. కూటమినేతలతో కలిసి నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో కరపత్రాలు పంచుతూ నూతన జిఎస్టి 2.0 ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు.
జీఎస్టీని 28% నుండి 18 శాతానికి, 18 శాతం నుండి ఐదు శాతానికి తగ్గించడం వల్ల ప్రతి కుటుంబానికి నెలకు 15 వేల రూపాయలు ఖర్చు తగ్గుతుందని, కావున ప్రతి ఒక్కరూ జీఎస్టీ నూతన విధానం వల్ల కలిగే ప్రయోజనాలు అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
నూతన జీఎస్టీ విధానం ద్వారా రైతులు, వినియోగదారులు, వ్యాపారులు ఇలా ప్రతి రంగం వారు లబ్ధి పొందుతారని ఎమ్మెల్యే సత్య ప్రభ అన్నారు..
ధరలు తగ్గడం ద్వారా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని, కొనుగోలు శక్తి పెరగడం ద్వారా అమ్మకాల పెరుగుతాయని, అమ్మకాలు పెరగడం ద్వారా వ్యాపార రంగం అభివృద్ధి చెంది, ఆర్థిక అభివృద్ధికి దారి తీస్తుందని అన్నారు.
ఎమ్మెల్యే ప్రచారంలో ప్రతి ఒక్కరు నూతన జీఎస్టీ విధానం పట్ల సంతృప్తిని వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యే సత్య ప్రభ కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో స్థానిక నాయకులు, మండలానికి చెందిన ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird