Home ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి (జి ఎం ఆర్ ఎఫ్) చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సత్యప్రభ

ముఖ్యమంత్రి సహాయ నిధి (జి ఎం ఆర్ ఎఫ్) చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సత్యప్రభ

by VRM Media
0 comments

నియోజకవర్గంలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేందుకు అంకిత భావంతో పనిచేస్తా- ఎమ్మెల్యే సత్య ప్రభ
వి ఆర్ ఎం మీడియా న్యూస్24 ప్రత్తిపాడు ప్రతినిధి ప్రిన్స్ అక్టోబర్ 7:–

కాకినాడ జిల్లా..
ప్రత్తిపాడు నియోజకవర్గం
ప్రత్తిపాడు మండలం పెద శంకర్లపూడి టీడీపీ కార్యాలయంలో
ప్రత్తిపాడు నియోజకవర్గాన

చెందిన 27 మంది లబ్ధిదారుల కుటుంబాలకు 21,28,470 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (జీఎంఆర్ఎఫ్) చెక్కులను ఎమ్మెల్యే సత్య ప్రభ అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్య ప్రభ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో వైద్యం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని తెలిపారు. సమాజంలోని ప్రతి వర్గం సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ఈ నిధి ద్వారా జీవనాధారంగా సహాయం అందిస్తున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి దూరదృష్టి, సేవాభావం వలన ఎన్నో కుటుంబాలు తిరిగి ఆశతో ముందుకు సాగుతున్నాయని చెప్పారు. ప్రజల ఆరోగ్యం, సంతోషం కోసం కృషి చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో జీవించేందుకు అవసరమైన సహాయాన్ని అందించడానికి ఎల్లప్పుడూ అంకితభావంతో పనిచేస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

2,819 Views

You may also like

Leave a Comment