
ప్రత్తిపాడు వి.ఆర్.ఎం.మీడియా న్యూస్24 ప్రతినిధి ప్రిన్స్ అక్టోబర్ 8:–
ప్రత్తిపాడు వైఎస్ఆర్సిపి నాయకులు నర్సాపురం పార్లమెంటరీ పరిశీలకులు ముదునూరు మురళి కృష్ణంరాజు తాడేపల్లి వైసిపి పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి సమీక్ష సమావేశానికి చేరుకుని పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కి పుష్పగుచ్చం అందించి న ముదునూరి మురళీకృష్ణం రాజు. అనంతరం పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న నాయకులు కాకినాడ జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా మిగిలిన మాజీ మంత్రులను మర్యాదపూర్వకంగా పలకరించి పార్టీ కార్యచరణ మరియు కూటమి పార్టీ చేస్తున్న తప్పుడు విధానాలు ప్రచారాలను ప్రజలకు తెలిసేలా చేసి కూటమి పార్టీ నాయకుల కనుసన్నల్లో జరిగిస్తున్న మద్యం మాఫియా పై ద్వజమెత్తి వైసిపి పార్టీపై అప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికారం లో ఉండగా చంద్రబాబు చేస్తున్న మద్యం మాఫియా పై నోరు విప్పని పవన్ కళ్యాణ్ వైనాన్ని ఎండ కట్టాలని నాయకులకు జగన్మోహన్ రెడ్డి సూచించారు. గ్రామాల్లో కిందిస్థాయి కార్యకర్తలకు అండగా ఉండాలని. ప్రతి రోజు రాష్ట్ర ప్రజల కు రైతులకు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని తెలిసేలా చేయాలని వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి సూచించారు.