Vrm media ప్రతినిధి వెంకట్




👉🏻నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్
👉🏻డివిజన్ నాయకులతో ముఖ్య సమావేశం
కేంద్ర ఎన్నికల కమిషన్,బీజేపీ ప్రభుత్వ చీకటి ఒప్పందాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్ల చోరీ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ కోరారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో బుధవారం ఖమ్మం పట్టణ డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓట్ చోర్ గద్దె చోడ్ ఉద్యమ పిలుపుల భాగంగా ఏఐసీసీ ఆదేశానుసారము టిపిసిసి సూచన మేరకు ప్రతి డివిజన్ నుండి 100 సంతకాలకు తగ్గకుండా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఒక వ్యక్తికి ఒక ఓటు అనేది రాజ్యాంగానికి మూల స్తంభం అని ఈ వ్యవహారంలో తీసి ఆ నిర్వచించడం లేదని ధ్వజమెత్తారు. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం బిజెపి చేతుల్లో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. బీహార్ లో ఓటర్ల లిస్ట్ లో జరిగిన అవకతవకలను ప్రజలకు వివరించాలని కోరారు. అంతే కాకుండా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనరిటి నాయకులు రబాని గారు, జిల్లా సేవాదళ్ ప్రెసిడెంట్ గౌజ్ గారు, నగర మైనరీటి అధ్యక్షుడు అబ్బాస్ , ఖమ్మం NSUI నగర అధ్యక్షుడు యశ్వంత్ , ఖమ్మం నగర డివిజన్ ప్రెసిడెంట్స్ రమేష్ , శ్రీనివాస్ , కనకరాజు , పూర్ణచంద్ , మహమూద్ , వెంకటయ్య , సుగుణ , కృష్ణ , రమేష్ , రవి , రాజీ , ప్రవీణ్ , ప్రసాద్ , యాకూబ్ పాషా , అబ్దుల్ అహద్ , జని , జహీర్ , శ్రీనివాస్ , విరయ , జనిమియ , శ్రీనివాస్ రావు , నరేందర్ , చంద్రశేఖర్ , రియాజ్ , గజ్జి సూర్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird